UPDATED 2nd FEBRUARY 2019 SATURDAY 6:00 PM
పెద్దాపురం: పేద ప్రజల్లో మానసిక స్పూర్తి నింపుతూ పింఛన్లు రెట్టింపు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు అన్నారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో పింఛన్లు, ఆడపడుచులకు పసుపు-కుంకుమ పథకం క్రింద రూ.10వేలు ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమం శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ తో కలిసి నిర్వహించారు. పెద్దాపురం పట్టణంలో 5638 మంది పింఛన్ దారులకు రూ.కోటి 76 లక్షలు, 839 డ్వాక్రా సంఘాలకు పసుపు-కుంకుమ పథకం క్రింద రూ.7 కోట్ల 98 లక్షలు అందచేస్తున్నామని మున్సిపల్ కమీషనర్ బిఆర్ శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మెప్మా అధికారిణి శైలజ, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, కౌన్సిలర్లు సింగపల్లి రవిశంకర్, విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, డ్వాక్రామహిళలు, తదితరులు పాల్గొన్నారు.







