UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్లో వేంచేసి గ్రామ దేవతగా ప్రసిద్ది చెందిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ పండితులు మంత్రికి ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వద్ద నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆస్పత్రి అభివద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, రైతుసంఘం అధ్యక్షుడు కంటే బాబు, ఆలయాల చైర్మన్ మద్దుకూరి జోగారావు, ఆలయ కమిటీ ధర్మకర్త వల్లూరి బుల్లియ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త పసల పద్మరాఘవరావు, ఆలయ పండితులు అప్పల వెంకట పవన్ శర్మ, దేవుళ్ళ సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.







