ముగిసిన ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణపై శిక్షణ

UPDATED 4th APRIL 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: మండలంలోని జి.మేడపాడు, ఉండూరు, కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామాలలో స్థానిక  విస్తరణ శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో ఘన, వ్యర్థ పదార్దాల నిర్వహణపై రెండు రోజులు పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు బుధవారంతో ముగిసాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 50 మంది శిక్షణ నిమిత్తం ఈ తరగతులకు హాజరయ్యారు. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పేదరిక నిర్మూలన, వ్యర్ధ రహిత గ్రామపంచాయతీలుగా రూపొందించే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణా పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ సీఈవో ఆర్. గోవిందరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, డీపీఎం రాంబాబు, మొహిద్దీన్, ఫ్యాకల్టీలు జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us