ఆదిత్య ఫార్మా-డి విద్యార్దులకు వర్క్ షాప్

UPDATED 13th APRIL 2018 FRIDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలోని ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలకు చెందిన ఫార్మా-డి విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి  పైకీ ఇన్నోవేషన్స్ అంకుర సంస్థకు చెందిన ప్రతినిధులు ఆర్. కార్తిక్, విజయలక్ష్మి, రామ్ మణిదీప్, రీనమౌనిక ముఖ్య అతిథులుగా హాజరైనారు. వైస్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ వృత్తివిద్యరీత్యా పెంపొందించుకోవలసిన నైపుణ్యాలు, వాటిని పొందడానికి, సమకూర్చుకోవడానికి కావలసిన మార్గాలు గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలకు సరైన వివరణ ఇచ్చి, వారి భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేశారు. నిరంతరం నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతున్న నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిరంతరం పోటీని ధీటుగా సాధన చేస్తూ విద్యను అభ్యసిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అన్నిరకాల సౌకర్యాలతో అనుభవజ్ఞులైన అధ్యాపక  సిబ్బంది, ల్యాబ్ సౌకర్యాలతో చక్కటి వాతావరణం గల కళాశాల విద్యార్థి శ్రేయస్సే పరమావధిగా పనిచేసే యాజమాన్యం లభించడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us