క్రీడా మైదానాల అభివృద్ధి వేగవంతం చేస్తాం

UPDATED 5th MARCH 2018 MONDAY 9:30 PM

సామర్లకోట: క్రీడా మైదానాల అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్లు రాష్ట్ర ట్రైబల్ క్రీడాధికారి ఎల్. దేవానంద్ పేర్కొన్నారు. స్థానిక పట్టన పరిధిలోని క్రీడా మైదానాలను, అలాగే మండలంలోని వేట్లపాలెం గ్రామంలో క్రీడా మైదానాలను ఎంపీడీవో బి. నాగేశ్వరరావు నేతృత్వంలో ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో ప్లే ఫీల్డ్ కచ్చితంగా ఉండాలని, అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల క్రీడా మైదానాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం క్రీడా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డివో సయ్యద్ హుస్సేన్, ఏపీవో సుధారాణి, ఎంఈవో కె. రమణమ్మ, జెడ్పిటిసి గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us