పారిశుధ్య కార్మికులకు షూస్ అందచేత

UPDATED 20th JULY 2020 MONDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): బ్యాంక్ ఆఫ్ బరోడా (పెద్దాపురం శాఖ) రూ. పదివేలు ఆర్ధికసాయంతో కొనుగోలు చేసిన షూస్ ను పెద్దాపురం పురపాలక సంఘ కార్మికులకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ బ్యాంకు ఆఫ్ బరోడా వార్షికోత్సవంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు షూస్ అందజేయడం అభినందనీయమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ షూస్ ధరించి అంటు వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్, శానిటరీ ఇనస్పెక్టర్ డేవిడ్ రాజు, బ్యాంకు మేనేజర్ వై. ఉదయకుమార్, బ్యాంకు సిబ్బంది చలపతి, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us