భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు

UPDATED 30th JANUARY 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో  వసంత పంచమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమి తిధిని పురస్కరించుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, వేద పండితుల ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పంచామృతాభిషేకం, సరస్వతీ హోమం, తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం, దాతల సహకారంతో పూజాద్రవ్యాలు, పుస్తకాలు, పెన్నులు, సరస్వతిదేవి రూపులు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, గోలి వెంకట అప్పారావు చౌదరి, సేపేని సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, మట్టపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us