అవినీతి నిర్మూలన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి

UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అవినీతి నిర్మూలన-నూతన భారతదేశ నిర్మాణం అనే అంశంపై బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. సుగుణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా కాకినాడ ఓఎన్జీసీ డిజిఎం, హెడ్ విజిలెన్స్, ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎస్సెట్ కె.వి. రెడ్డి, కె.ఎం.కె. మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం చాలా గొప్ప దేశమని, భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా అవినీతి నిర్మూలనకు ప్రజలందరూ భాద్యతగా తీసుకోవాలని, అవినీతి నిర్మూలన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించి, ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి విద్యార్థులు, ప్రజలు ఐక్యం కావాలని, ఎటువంటి సమస్యలనైనా నిర్మూలించడం యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులు ఎ. ఆరుముగం, టి.పి. రావు, ఆదికవి నన్నయ విశ్వవిదాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ మేనేజ్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరామరాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, మేనేజ్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు కె. పవన్ కుమార్, బి.కె. విద్యాసాగర్, కె. శైలజారావు, డి. విజయలక్ష్మి, డాక్టర్ డి. సుమ, తదితరులు పాల్గొన్నారు.                         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us