సంక్షేమ పథకాలు అమలులో యువత పాత్ర కీలకం

* కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు 
* సూరంపాలెంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

UPDATED 2nd MARCH 2020 MONDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతం కావడానికి యువత ప్రముఖ పాత్ర వహించాలని, నేటి యువతరం వాటిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళుతూ తమ వంతు సహకారం అందించాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు సూరంపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే కళాశాల విద్యార్థుల స్వచ్చంద సేవాదళం వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికి పర్యటించి ఆరోగ్యం, పోషక విలువలు, స్పెషల్ హెల్త్ చెకప్, పరిసరాల పరిశుభ్రత, గ్రామ స్వచ్ఛత వంటి పలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పద్మావతి, సోషల్ వెల్ఫేర్ టెక్నికల్  అసిస్టెంట్ ప్రసాద్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి. రాజశేఖర ఫణీంద్ర, బి.సుధీర్, ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్లు, విద్యార్థులు ప్రమోద్, శశాంక్, చైతన్య, సూర్యనారాయణ, జ్యోతిర్మయి, స్నేహ, తదితరులు పాల్గొన్నారు.

      

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us