UPDATED 6th APRIL 2022 WEDNESDAY 5:00 PM
PEDDAPURAM RDO : పెద్దాపురం ఆర్డీవోగా జె.సీతారామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనకాపల్లి ఆర్డీవోగా పనిచేస్తూ బదీలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకూ ఇక్కడ పనిచేసిన పసుపులేటి వెంకటరమణ ఒంగోలు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. సీతారామారావు 1995లో డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికయ్యారు.2005 నుంచి వంశధార తహసీల్దార్ గా పనిచేస్తూ 2014 లో డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతిపొంది శ్రీకాకుళం ఆర్డీవోగా నియమితులయ్యారు.
2019 నుంచి అనకాపల్లి ఆర్డీవోగా పనిచేస్తూ బదిలీపై ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలయ్యేలా చూస్తూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో గల 11 మండలాల తహసీల్దార్లతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తానని ఆయన తెలిపారు.
నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఆర్డీవోను పెద్దాపురం తహశీల్దార్ బూసి శ్రీదేవి, ఆర్డీవో కార్యాలయం డిటిలు రామ్ కుమార్, భానుకుమార్, తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.







