UPDATED 23rd JULY 2017 SUNDAY 7:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ అసిస్టెంట్ కమీషనర్, పాలక మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పులిహార పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.







