UPDATED 24th JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. ప్రజలు, పలు ప్రజా సంఘాలు వైఎస్సార్ సిపి పిలుపునిచ్చిన బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతానికి కృషిచేశారు. ప్రత్యేక హోదాపై తమ ఆకాంక్షను మరోసారి బలంగా చాటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







