UPDATED 16th MARCH 2018 FRIDAY 10:00 PM
సామర్లకోట: ప్రతీ మహిళా మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని జిల్లా పరిషత్ సిఈవో ఆర్. గోవిందరావు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నామని, దీని ప్రకారం మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే విధంగా శిక్షణ ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాపారాలు ప్రారంభించి ప్రతి మహిళా మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని ఆయన అన్నారు. మహిళలు వ్యాపారాలు చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారి వెంకట్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, ఫ్యాకల్టీలు కుమార్ రాజా, గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.







