శాస్త్రోక్తంగా చంద్రగ్రహణ శుద్ధి

UPDATED 17th JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన  శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. వేకువ జాము వరకు చంద్రగ్రహణం ఉండడంతో గ్రహణ సమయం ముగిసిన తరువాత శుద్ధి కార్యక్రమాన్ని దేవస్థానం వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను శుద్ధి చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. గ్రహణ స్నానం చేసిన తరువాత అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us