స్వాతంత్ర దినోత్సవానికి గణిత చదరంతో వినూత్న స్వాగతం

UPDATED 13th AUGUST 2017 SUNDAY 6:00 PM

సామర్లకోట: 71 వసంతాల స్వాతంత్ర దినోత్సవానికి ఆ విద్యార్థి వినూత్నంగా స్వాగతం పలికాడు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన తోటకూర వి.ఎస్.ఎస్.సాయి వంశీ ఎటు కూడినా 71 వచ్చే విధంగా తయారు చేసిన గణిత చదరం పలువురిని అబ్బురపరిచేలా చేసింది. ఈ గణిత చదరంలో అడ్డు వరసలు, నిలువు వరసలు, కర్ణాలు మొత్తం ఎటు కూడినా, ఏవిధంగా ఎటు చూసినా 71 వచ్చే విధంగా రూపొందించాడు. వంశీ కాకినాడ ఆదిత్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు.   గణిత చదరాన్ని రూపొందించిన వంశీని సంస్థ సెక్రటరీ ఎన్.కృష్ణదీపక్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమణి, ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ తదితరులు అభినందించారు.          
  
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us