ముగిసిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం

UPDATED 27th AUGUST 2017 SUNDAY 7:00 PM

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 29న మొత్తం 48 వార్డులకు 196 కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కాకినాడలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించి, టిడిపి, బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 39 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు, 9 వార్డుల్లో బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారంటూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారానికి నేడు (ఆదివారం) చివరి రోజు కావడంతో ఆ పార్టీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 48 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మొత్తం 17 వార్డుల్లో అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దింపింది. ఆ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పల్లంరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో 121 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us