ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ఈనెల 29న విజయవాడలో జరగనున్న ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాదిగ మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు కాపవరపు కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రాం విగ్రహాల వద్ద మాదిగ మహాజన సంఘం కార్యదర్శి కాపవరపు జాన్ ఆధ్వర్యంలో ప్రపంచ మాదిగ దినోత్సవ గోడ పత్రికలను బుధవారం మాదిగ మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు కాపవరపు కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన విజయవాడలో జరిగే ప్రపంచ మాదిగ దినోత్సవానికి విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలివెల నాని, మిరియాల బ్రదర్స్, మిరియాల వీరబాబు, కాపవరపు కృష్ణ, కొల్లి రవితేజ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us