హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా టీచర్స్‌డే వేడుకలు

UPDATED 5th SEPTEMBER 2017 TUESDAY 9:00 PM

ఏలూరు : హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ్‌నగర్‌లో ఉన్న జింగిల్‌బెల్స్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెదిరెడ్డి ప్రదీప్ మాట్లాడారు. గురువులను గౌరవించడం మన బాధ్యతని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సామాన్య ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన సర్వేపల్లి జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. తల్లిదండ్రులు తర్వాత గురువు దైవంతో సమానమని, మనం అత్యున్నత స్థాయిని అధిరోహించాలంటే గురువులే ప్రధానపాత్ర వహిస్తారని కొనియాడారు. దీనిలో భాగంగా క్లబ్ సభ్యులైన కడియాల విజయలక్ష్మీ, విస్సాప్రగడ సురేష్‌లను, అలాగే జింగిల్ బెల్స్ పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివనాగపోతురాజు, జడ్‌సి వడ్లపూడి కృష్ణమోహన్‌, జాయింట్‌ సెక్రటరీ బొల్లా శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us