* జె.ఎన్.టి.యు.కె రెక్టార్ డాక్టర్ పూర్ణానందం
* దివిలి కిట్స్ లో ఘనంగా రిజల్యూషన్స్ 2కె18 ప్రారంభోత్సవ వేడుకలు
UPDATED 9th MARCH 2018 FRIDAY 10:00 PM
పెద్దాపురం: యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, దేశాభివృద్ధికి విద్యార్థులే మార్గనిర్దేశకులని జె.ఎన్.టి.యు.కె రెక్టార్ డాక్టర్ కె. పూర్ణానందం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండురోజులు పాటు నిర్వహించనున్న రిజల్యూషన్స్ 2కె18 కల్చరల్ ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పూర్ణానందం మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు తమ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తూ మానవాళి పురోగతికి ఉపయోగపడే విధంగా నూతన ఆవిష్కరణలను రూపకల్పన చేయాలన్నారు. సాంకేతికరంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకుంటూ నేటి పోటీ ప్రపంచంలో విశ్వవిజేతలు కావాలని సూచిందారు. తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల మేథస్సును పెంపొందించే వీలుగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ ప్రెజంటేషన్స్, షార్ట్ ఫిలిం మేకింగ్ కాంపిటేషన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఫెస్ట్ కన్వీనర్ బేతినీడి వీరేంద్ర, ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ సర్వరామేశ్వరుడు, ప్రొఫెసర్ దివాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.







