గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి

UPDATED 3rd MAY 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగు అధికారులను ఆర్.డి.వో వి. విశ్వేశ్వరరావు ఆదేశించారు. స్థానిక ఆర్.డి.వో కార్యాలయంలో డివిజన్ లోని హౌసింగ్ అధికారులు, తహశీల్దార్లతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.డి.వో మాట్లాడుతూ బి.ఎల్.సి, ఎన్.టి.ఆర్.రూరల్, వి.ఎం.ఎ.వై  గ్రామీణ హౌసింగు కార్యక్రమాల క్రింద మే మూడవ వారంలోపు గ్రేడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు మేరకు టిడ్కో ద్వారా పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో కూడ జి.ప్లస్ 2, జి ప్లస్ 3 గృహాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా హౌసింగుకు సంబందించిన ప్రగతిపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగు ఇ.ఇ డి. సుధాకర్ పట్నాయిక్, డివిజన్ లోని తహసీల్దార్లు, హౌసింగు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us