జనవరి 11న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

UPDATED 10th JANUARY 2020 FRIDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయ 6వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జంధ్యాల వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఎక్కువని తెలిపారు. సుమారు 11,034 మంది అభ్యర్థులు ఈనెల 11వ తేదీ శనివారం ఉదయం 11-15 నిమిషాలకు జరగనున్న ఈ ప్రవేశ పరీక్ష నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9849778512, 9247469929, 9441237930, 8639562572, 8001957625, 9394110111 నెంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us