జనవరి 27 నుంచి శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణమహోత్సవాలు

UPDATED 26th JANUARY 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో వేంచేసి ఉన్నశ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక కల్యాణమహోత్సవాలు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మలకల సూర్యారావు (సూరిబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామము నడిబొడ్డులో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం 1971లో నిర్మించడం జరిగిందని, నాటి నుంచి స్వామివారి కరుణా కటాక్షవీక్షణాలతో ప్రజలందరూ సుఖ శాంతులతో జీవిస్తున్నారన్నారు. గ్రామస్థుల సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం ప్రారంభం నుంచి తమ కుటుంబసభ్యులే ధర్మకర్తలుగా భాద్యతలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27శనివారం రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి కళ్యాణం, ప్రతీ రోజు నిత్య హోమము, నిత్య పూజలు, బలిహరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అలాగే 29 సోమవారం సదస్యం, 31 బుధవారం పూర్ణాహుతి, చక్రస్నానం, ఫిబ్రవరి ఒకటి గురువారం రాత్రి 8-30కు శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఈ సమావేశం లో ఆలయ కమిటీ సభ్యులు తోటకూర శ్రీనివాస ప్రకాశరావు, కంటిపూడి గోపాలం, తోటకూర రాంబాబు, తోటకూర సత్తిబాబు, తోటకూర సూర్య ప్రభాకరరావు, పెదరామారావు, పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us