చాచా నెహ్రూకు గణిత చదరంతో శుభాకాంక్షలు

UPDATED 13th NOVEMBER 2018 TUESDAY 5:30 PM

సామర్లకోట: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 129వ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బాల గణితావధాని తోటకూర సాయివంశీ  ఎటు కూడినా 129 వచ్చే విధంగా గణిత చదరం రూపొందించి వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్న వంశీ జాతీయ పర్వదినాలు, జాతీయ నాయకుల పుట్టినరోజు, తదితర సందర్భాలలో ఈ విధంగా గణిత చదరాల ద్వారా శుభాకాంక్షలు తెలపడం ఒక అలవాటుగా మార్చుకొన్నారు. వంశీ అవధాన ప్రక్రియను తన పెదనాన్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ వద్ద అభ్యసించి పలు వేదికలపై అవధానాలు చేసి గురువుల, మేధావుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సందర్భంగా సాయివంశీని ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి నల్లమిల్లి కృష్ణ దీపక్ రెడ్డి, ప్రిన్సిపాల్ మొయినా, సాయిరామకృష్ణ, తదితరులు అభినందించారు. 
    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us