నెల్లిపూడిలో పూరిపాక దగ్ధం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో పూరి పాక దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. నెల్లిపూడికి చెందిన తోట నాగమణి ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఇటీవలే వరి పంటను ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేసుకున్నారు. చేతికంది వచ్చిన పంటతో పాటు బట్టలు, బంగారం వంటి విలువైన వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us