UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 7:00 PM
సామర్లకోట : సామర్లకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రక్తహీనతతో ఉన్న గర్భిణీలను గుర్తించి వారికి పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఉన్న అపర్ణ టైల్స్ యాజమాన్యం పౌష్టికాహారాన్ని శుక్రవారం అందజేశారు. ఈ మేరకు సంస్థ 90 మంది గర్భిణీలకు నెలరోజులు సరిపడిన బెల్లం, రాగిపిండి అందచేశారు. దీనిని స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో గర్భిణీలకు అందజేశారు. ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే పుట్టబోయే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అపర్ణ సిరామిక్స్ ప్రతినిధులు హెచ్.ఆర్ మేనేజర్ మధుసూదన్, సత్యన్నారాయణ, ఐసిడిఎస్ సూపర్ వైజర్లు బాలాత్రిపుర సుందరి, నళిని, డి. మణి, మంగ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.







