ఆసుపత్రి అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించాలి

UPDATED 3rd MAY 2018 THURSDAY 6:30 PM

పెద్దాపురం: ఆసుపత్రి అభివృద్ధికి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని ఆర్.డి.వో వి. విశ్వేశ్వరరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.డి.వో ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికాంత్ తో చర్చించారు. ఆసుపత్రికి కేటాయించిన అభివృద్ధి నిధులకు సంబంధించి నగదు నిల్వ రూ. 21 లక్షలుగా గుర్తించడం జరిగింది. ఈ సొమ్ముతో ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఖర్చుచేసి వివరాలను సమావేశంలో చర్చించి నివేదిక తయారుచేయడం జరిగింది. వీటిలో అంబులెన్స్ రిపేర్, ఫర్నీచర్, ఎసి, పెయింటింగ్, ఎమర్జన్సీ లైట్, వాషింగ్ రూమ్స్, తదితర అంశాలను నివేదికలో పొందుపర్చడం జరిగింది. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతం శానిటేషన్, డస్ట్ బిన్స్ ఏర్పాటు, డాక్టర్ల కొరత, సిసి కెమెరాలు, జననీసురక్ష, కుటుంబ నియంత్రణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం, ఒఆర్ఎస్ పేకట్లు అందుబాటులో ఉంచడం తదితర అంశాలపై  ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బిక్కన సాయినాధ్, వి. రాజేశ్వరరావు, ఆసుపత్రి పరిపాలనా సిబ్బంది, నర్సులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us