పీఎంపీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శేషాచార్యులు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గంగవరానికి చెందిన వాడపల్లి శేషాచార్యులు ఎన్నికయ్యారు. గోకవరం, కోరుకొండ ఏజెన్సీ మండలాలకు చెందిన అసోసియేషన్ సమావేశం శుక్రవారం జరిగింది. శేషాచార్యులు ఏజెన్సీ తరపున ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బళ్ల శ్రీనివాస్, గోకవరం యూనిట్ అధ్యక్షులు పి.చిన్ని, కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు లాజర్, పవన్, మల్లేష్, వెంకటేష్, లక్ష్మణ్ రావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us