అంగరంగ వైభవంగా మాండవ్య నారాయణస్వామి కళ్యాణం

UPDATED 27th MARCH 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అతి పురాతన వైష్ణవాలయం శ్రీదేవీ, భూదేవీ సమేత మాండవ్య నారాయణస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త బిక్కిన సాయి దంపతులు పీటలమీద కూర్చుని కల్యాణం జరిపించారు. అలాగే స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర పాత సామర్లకోట వేణుగోపాలస్వామి ఆలయంలో దవులూరి సుబ్బారావు దంపతులు పీటల మీద కూర్చొని కల్యాణం జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల కోలాటం, విష్ణు సహస్రనామ పారాయణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పంచారామ క్షేత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి  పులి నారాయణమూర్తి, చుండ్రు సుబ్బారావు, బిక్కిన వెంకటేశ్వరరావు, ఆలయ పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us