గైట్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

UPDATED 1st JANUARY 2019 TUESDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైతన్యా విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం గైట్ ప్రాంగణంలో గల ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది చైతన్యరాజును కలిసి పుష్పగుచ్చాలు, పండ్లు అందచేసి నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైతన్యరాజు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, కీర్తిప్రతిష్ఠలతో జీవితాలు వెల్లివిరియాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గైట్ ప్రాంగణంలో గల కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎండి ధనరాజు, డాక్టర్ పిజి రామానుజం, డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు గత సంవత్సరంలో సాధించిన విజయాలను వివరించి నూతన సంవత్సరంలో తమ కార్యాచరణ ప్రణాలికను తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థల సిఇవో డాక్టర్ డిఎల్ఎన్ రాజు, జనరల్ మేనేజర్లు డాక్టర్ ఎ. నరేష్ రాజు, డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ కెవి రామరాజు, సి.ఎఫ్.వో రమేష్ నాయుడు, ఒఎస్డి ఎన్. బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us