కోలుకొంటున్న కలుషితాహార బాధితులు

UPDATED 11th OCTOBER 2017 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ చంద్రయ్య గ్రామంలోబుధవారం సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందచేస్తునట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), కాండ్రకోట ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు డాక్టర్ సి.హెచ్. ధనలక్ష్మి, ఎంపీహెచ్ఈవో యేలియా, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us