అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు

* వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు
* ప్రజలలో నాడు- ప్రజలతో నేడు కార్యక్రమం ప్రారంభం

UPDATED 6th NOVEMBER 2020 FRIDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర జరిగి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజలలో నాడు- ప్రజలతో నేడు కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. తొలుత మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో గల శృంగార వల్లభస్వామి దేవాలయంలో దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి, చంద్రమాంపల్లి, దివిలి గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం దొరబాబు మాట్లాడుతూ నాటి పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తమ పార్టీ అధినేత నేడు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాల ద్వారా వారికి మేలు చేస్తున్నారని, ప్రతీ హామీని అమలు చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన చేస్తూ, గడపగడపకూ సంక్షేమ పధకాలు అందించడమే ధ్యేయంగా పాలనా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.  

   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us