ఘనంగా శ్రీ స్వామి వివేకానంద జన్మతిథి వేడుకలు

UPDATED 8th JANUARY 2018 MONDAY 7:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద 155వ జన్మతిధిని పురస్కరించుకుని శ్రీ శారదా రామకృష్ణ నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రమణ్యశర్మచే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏకవార రుద్రాభిషేకాలు, విశేష పూజలు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి పురవీధుల్లో శ్రీ స్వామి వివేకానంద శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ స్వామి వివేకానంద సూక్తులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాఠశాల విద్యార్థులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యశర్మ మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకం, అనుసరణీయం అన్నారు. మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన గొప్ప ఆధ్యాత్మికవేత్త వివేకానందుడని, యువశక్తి భారతదేశ సంపదని, యువత జాగృతమై దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధం, సభ్యులు నువ్వుల వెంకట్రాజు, పెంటపాటి మల్లిఖార్జునరావు, ఎన్.బాబ్జి, చెవ్వాకుల సత్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us