సామర్లకోటలో ఆధ్యాత్మిక పరిమళం

UPDATED 12th NOVEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: కార్తీక పూజలతో ప్రసిద్ధ పంచారామ క్షేతం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న భీమేశ్వరాలయాన్ని కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వేకువజామున నాలుగు గంటలకే ఆలయానికి చేరుకున్న భక్తులు పవిత్ర గోదావరి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి నేతి దీపాలు వదిలారు. స్వామి వారికి ఉదయం నుంచి క్షీరాభిషేకాలు, రుద్రాభిషేకాలు, సాయంత్రం అర్చనలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us