విద్యార్థులకు స్టీలు కంచాలు పంపిణీ

UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి నక్కా జానకిరామయ్య సుమారు ఆరువేల రూపాయలు విలువ చేసే స్టీలు కంచాలు బహూకరించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ మేరకు స్టీలు కంచాలను దాత నక్కా జానకిరామయ్య చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం వారానికి ఐదు కోడిగుడ్లతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షఫీయుల్లా, జి. గోవిందు, ఏపీ రాజేంద్రకుమార్, కోడూరి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us