UPDATED 9th OCTOBER 2019 WEDNESDAY 9:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల సరస్వతీదేవి నిలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీరామశర్మ, ప్రసాద్ నేతృత్వంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రి కార్యక్రమాలలో ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు, కర్రి వెంకట కృష్ణారెడ్డి, సరోజినీ దేవి దంపతులు, సతీష్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు, కృష్ణదీపక్ రెడ్డి, సుగుణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మేళతాళాల మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.







