* గైట్‌లో అట్టహాసంగా ప్రారంభమైన మైత్రి 2కె19
UPDATED 1st MARCH 2019 FRIDAY 10:00 PM
రాజానగరం: క్రీడాస్ఫూర్తితో జీవితాన్ని మలచుకుని భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవాలని జెఎన్టీయుకె రిజిస్ట్రార్ ఆచార్య డాక్టర్ వి.వి.సుబ్బారావు అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించే మైత్రి 2కె19 క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెఎన్టీయుకె రిజిస్ట్రార్ ఆచార్య డాక్టర్ వి.వి.సుబ్బారావు హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారికి సరైన అవకాశాలు కల్పించడానికి క్రీడా సాంస్కృతిక పోటీలు మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు గురించి ఆలోచించకుండా భాగస్వామ్యం వహించడం ప్రధానంగా భావించాలని అన్నారు. ఇటువంటి మైత్రి ఉత్సవాలు నిర్వహించడం అధిక వ్యప్రయాసలతో కూడుకున్నదని, అయినా దీనిని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గైట్ యాజమాన్యం అభినందనీయులని ఆయన అన్నారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశికిరణ్ వర్మ మాట్లాడుతూ యువతకు అవకాశాలు అనంతమని వాటిని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా పయనించాలని అన్నారు. మైత్రి ఉత్సవాలను గత దశాబ్ద కాలానికి పైగా గైట్ లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జెఎన్టీయుకె రిజిస్ట్రార్ ఆచార్య సుబ్బారావు, క్రీడాపతాకాన్ని గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ, కళాశాల పతాకాన్ని గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల నుంచి క్రీడావందనాన్ని స్వీకరించారు. ఒలింపిక్ జ్యోతిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీశశివర్మ వెలిగించి క్రేడాకారులకు అందించారు. అనంతరం 800 మీటర్ల పరుగుపందేన్ని మహిళలు, పురుషుల విభాగంలో నిర్వహించి విజేతలకు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, చైతన్య విద్యా సంస్థల సీఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివీప్రసాద్, డాక్టర్ ఎస్ ఎస్ఎన్ రాజు, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎండి ధనరాజు, డాక్టర్ పిజి రామానుజం, డైరెక్టర్ డాక్టర్ ఎల్.ఎస్. గుప్తా, మైత్రి కోఆర్డినేటర్లు డాక్టర్ సిఎం. హెన్రీ, డాక్టర్ వి. కుసుమకుమారి, ఓఎస్డీ ఎన్.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.







