కుటుంబంలో ప్రశాంతతకు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి

UPDATED 25th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: కుటుంబంలో ప్రశాంతంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలని ప్రముఖ  అంతర్జాతీయ క్రైస్తవ టివి వర్తమానికులు డాక్టర్ ఈలి సత్య సువార్తరాజు, డాక్టర్ స్టువర్ట్, జ్యోత్న అన్నారు. స్థానిక రివర్ ఫర్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటరులో భార్యాభర్తలకు కపుల్ మీట్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రేయర్ సెంటర్ నిర్వాహకులు ఈ షారోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్  సత్య సువార్తరాజు, స్టువర్ట్, జ్యోత్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ప్రేమానురాగాలు పంచుకుంటూ జీవిస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని, కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి తప్ప పోలీసు స్టేషనుకు వెళ్లకూడదన్నారు. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఉన్నప్రేమను కాపాడుకోవాలని, దానికి గాను పెళ్లి సమయంలో చేసుకున్న ప్రమాణాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి భార్యాభర్తలను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి అధ్యక్షులు బిఎస్ వందనం, సహాయ కార్యదర్శి పి. సత్యనారాయణ, రిటైర్డ్ హెఎం ఐఈ జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us