అవగాహనతోనే కిశోర బాలికల వికాసం

UPDATED 7th JANUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: కౌమర దశలోని శారీరక మార్పులు, తదితర విషయాలపై బాలికల్లో పూర్తి అవగాహన ఉన్నప్పుడే కిశోర బాలికల్లో అభ్యున్నతి సాధ్యమవుతుందని ఐసిడిఎస్ ఎపిడి మణెమ్మ పేర్కొన్నారు. కిశోర వికాసం రెండవ విడత కార్యక్రమంలో భాగంగా స్థానిక వైఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎపిడి మణెమ్మ మాట్లాడుతూ  బాల బాలికలపై అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి అవగహన కల్పించేందుకు ప్రభుత్వం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న సుమారు ఆరువేల మందికి 218 మంది పీర్  గ్రూప్ ట్రైనర్లుతో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఎపిడి మణెమ్మ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అర్బన్ సిడిపివో టీడీఆర్ పద్మావతి శిక్షణ పొందిన ట్రైనర్లుతో బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకట్, వైఆర్ఎల్ కళాశాల డైరక్టర్ రవిచంద్, ప్రిన్సిపాల్ లావణ్యచంద్, న్యాయవాది సంతోషకుమారి, సుందరి, నళిని కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us