UPDATED 17th SEPTEMBER 2018 MONDAY 11:00 AM
సామర్లకోట: వినాయక నిమజ్జనం సందర్భంగా పాటించవలసిన నియమాలను తెలిపే హెచ్చరిక బోర్డులను స్థానిక గోదావరి పుష్కరిణి వద్ద పోలీసులు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్ సోమవారం వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున దగ్గరలోనే నిమజ్జనాలు చేయాలని లోతుకి వెళ్లరాదని అన్నారు. నిమజ్జన సమయంలో చిన్నపిల్లలను వెంట తీసుకుని వెళ్లరాదని, నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







