UPDATED 30th JUNE 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం, కొప్పవరం గ్రామాలలో శనివారం నిర్వహించిన గ్రామ రెవిన్యూ సభల్లో మొత్తం ఏడు అర్జీలు రాగా, అందులో అడంగల్ సవరణకు 4, సర్వేకు1, పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఒకటి, 22(a) లో తొలగించుటకు ఒకటి ధరకాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ ఎల్. శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఈ సదస్సులను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







