UPDATED 4th FEBRUARY 2018 SUNDAY 6:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం పెదబ్రహ్మదేవం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ శిబిరంలో పెదబ్రహ్మదేవం గ్రామస్తులే కాకుండా ఇల్లపల్లి, రంగాపురం, మేడపాడు, మర్రిపూడి, తుమ్మలపల్లి తదితర గ్రామాలకు చెందిన 169 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 42 మందిని శస్త్ర చికిత్సల నిమిత్తం కాకినాడ పంపించారు. శ్రీ శారద రామకృష్ణ సేవా సమితి వారికి భోజన సదుపాయాలు కల్పించారు. ఈ శిబిరంలో సేవా సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్, వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, వింజమూరి విశ్వనాధం, నువ్వుల బాబ్జి, పెంటపాటి మల్లికార్జునరావు, టి.వి.వి. సత్యనారాయణ, తదితరులు సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ బాల మోహన్ రాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. సోమిరెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.







