ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన

UPDATED 4th JANUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు పెదబ్రహ్మదేవం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఎం. నీరజ పేర్కొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 124 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీరజ మాట్లాడుతూ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us