UPDATED 10th MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగ్ లో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంఘటన గురువారం జరిగింది. ఏలేశ్వరంకు చెందిన ఊరా నాగలక్ష్మి, భర్త రాజబాబు పిఠాపురంలోని ఫంక్షన్ కు బయల్దేరారు. సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లడానికి బస్సు ఎక్కుతున్న సమయంలో నాగమణి చేతి బ్యాగ్ ను ఎవరో దుండగులు కత్తిరించి దొంగిలించారు. బస్సు ఎక్కిన తరువాత బ్యాగ్ ను గమనించిన బాధితురాలు బస్సు అంతా వెతికినా ప్రయోజనం కనిపించలేదు. ఆ బ్యాగ్ లో సుమారు ఇరవై కాసుల బంగారు ఆభరణాలను ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.







