UPDATED 17th AUGUST 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: మాజీ ప్రధాని భారతరత్న అటిల్ బిహారీ వాజ్ పాయ్ మృతి దేశానికి తీరని లోటని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్ పాయ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ భారత పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడంలో, పొరుగు దేశాలతో సత్ససంబంధాలను మెరుగుపరచడం, దేశాన్ని ప్రగతి పథంతో నడపించడంతో వాజ్‌పేయి చేసిన కృషి ఎనలేనిదన్నారు. గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాలకు రహదారులు, సుజలధార పథకం ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీరు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, మేనేజర్ ఎస్. అచ్యుతరాజు, ఆర్వో సిహెచ్ వెంకటేశ్వర్లు, టిపివో రత్నాకర్, ఎన్.ఎల్. సంగీత, మాధురి. సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, శ్రీహరి, ఏసుబాబు, తదితరులు పాల్గొన్నారు.







