పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

UPDATED 11th JULY 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని లెనోరా దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజానగరంలోని లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి పరిసరాల్లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని నగరాలు ఉత్తర భారతదేశంలోని నగరాల్లో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మానవ చర్యల వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతిని పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి, తరిగిపోతున్న అటవీ సంపద, కలుషిత వాతావరణంతో మానవుల జీవన రేటు తగ్గుతోందని, స్వచ్ఛమైన వాతావరణంలో రోజుకో గంట పాటు గడిపితే జీవన రేటు పెరుగుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, భవిష్యత్తు తరాలకు మనమిచ్చే గొప్ప బహుమతి పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, సి.ఎఫ్.వో సాగర్ రెడ్డి, ఎవో అనురాధ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us