ప్రగతిలో ఘనంగా చిన్నారుల స్నాతకోత్సవం

UPDATED 16th MARCH 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక మారుతీనగర్ లో గల ప్రగతి పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉందని, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకత, క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్. పూర్ణచంద్రరావు, ఏవో సి.హెచ్. సత్యనారాయణ, హెచ్.ఎం. నరసమాంబ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us