కొనసాగిన గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు

UPDATED 12th JULY 2019 FRIDAY 8:00 PM 

పెద్దాపురం: గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు రెండోరోజూ కొనసాగాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు చినబ్రహ్మదేవం, వాలుతిమ్మాపురం, చంద్రమాంపల్లి గ్రామాలకు చెందిన 120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల ఎంపిక నిష్పక్షపాతంగా కొనసాగుతున్నాయని, వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వూ తేదీలను ఎస్ఎంఎస్ రూపంలో ముందుగా సమాచారం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, ఎంఏవో కొల్లి ద్వారకాదేవి, మండల ఇంజనీర్ అప్పారావు, ఎంపీడీవో కార్యాలయం సూపరెంటెండెంట్ విప్పర్తి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.        
         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us