UPDATED 5th APRIL 2018 THURSDAY 6:00 PM
కాకినాడ: మాజీ భారత ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా స్థానిక లేడిస్ క్లబ్ వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి గురువారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, యస్.పి. విశాల్ గున్ని, నగర మేయర్ సుంకర పావని, జాయింట్ కలక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో పాటు జాయింట్ కలక్టర్-2 జె. రాధా కృష్ణమూర్తి, 39వ డివిజన్ కార్పొరేటర్ మల్లిపూడి నాగ సూర్యదీపిక, సోషల్ వెల్ఫేర్ డి.డి. శోభారాణి, ఆర్.డి.వో. ఎల్. రఘుబాబు, యస్.సి. కార్పొరేషన్ ఇడి డేవిడ్ రాజా, బి.సి. కార్పొరేషన్ ఇడి ఎమ్. జ్యోతి, డి.ఎమ్.హెచ్.వో డాక్టర్ ఎం. చెంచయ్య, డి.ఎస్.వో పి. ప్రసాదరావు, ఎంప్లామెంట్ ఆఫీసర్ ఇ. వసంత కుమారి, ఎన్.టి.ఆర్. వైద్య సేవా కో-ఆర్డినేటర్ వి. వరప్రసాద్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ బాల సుబ్రమణ్యం, అయితాబత్తుల రామేశ్వరరావు, ధనరాశి శ్యామ్ సుందర్, కె. సుబ్బారావు, కాశీ వలియా సాహెబ్, కళ్యాణం కోటేశ్వరావు, కె. నరసింహరావు, వల్లూరి సత్తిబాబు, పిట్టా వరప్రసాద్, కొండేపూడి సుబ్బారావు, ఆరుముర్తి చిన్న, పలివెల సత్యానందం, మోహనరావు, నక్కా చిట్టిబాయి, ఎమ్. వెంకటరావు, వల్లూరి సురేష్, బొడపాటి కాంతం, తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.







