ఆదిత్య లియో క్లబ్ కు నూతన కార్యవర్గం ఎంపిక

UPDATED 12th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గల లియో క్లబ్ కు నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, అతిథులుగా కాకినాడ లైన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ కె. శ్రీనివాస్, లైన్స్ క్లబ్ అడ్వైజర్ యం.వి.ఆర్. మోహన్ కుమార్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, ఆదిత్య మాజీ లియో ప్రెసిడెంట్ ఎస్. కోందజేశ్వరన్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించి విధివిధానాలు, సేవా కార్యక్రమాల గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ అతిధులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us