ఆదిత్యలో లైఫ్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణా తరగతులు

UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో లైఫ్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జికి చెందిన అంకిత్ డే హాజరై మాట్లాడారు. 1952వ సంవత్సరంలో ఆఫ్రికా, ఘనా దేశాల ప్రజలు తమ నైపుణ్యాలను మెరుగుపరచడంలో చాలా వెనుకబడి ఉండేవారని, వారు ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా స్థానం సంపాదించారన్నారు. భారతదేశం అతి పురాతన సంస్కృతీ, సంప్రదాయాలు గల దేశమని, దేశ విలువలు, నాగరికత, సంస్కృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకత విద్యార్థులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us